MHBD: రాష్ట్ర బడ్జెట్లో గొర్రెల, మేకల సంక్షేమానికి 10 వేల కోట్లు కేటాయించాలని GMPS రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తగూడ (M) లోని పూసల భవన్లో జరిగిన జిల్లా 3 మహాసభలో పాల్గొని మాట్లాడారు. దళారుల ప్రమేయం లేకుండా నగదు బదిలీ ద్వారా రెండవ విడత గొర్రెల పంపిణీ చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి తదితరులు ఉన్నారు.