VKB: వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఓ గ్యాస్ ఏజెన్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ నిల్వలు, పంపిణీ రికార్డులను పరిశీలించి, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాలకు తావివ్వకుండా, సిలిండర్లను సరఫరా చేయాలని సూచించారు.