E.G: ద్వారకా తిరుమల మండలం సి.హెచ్. పోతేపల్లికి చెందిన బక్క తరుణ్ విష్ణు కుమార్ నిరుపేద ఇంజనీరింగ్ విద్యార్థి జీవితం ఎంతో విషాదకరంగా మారింది. చిన్న వయసులోనే తండ్రిని, తల్లిని కోల్పోయాడు. అనాధ బాలుడు చదువు కొనసాగించడం చాలా కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు శుక్రవారం సొంత నిధులతో ఆర్థిక సహాయంతో ల్యాప్టాప్ అందజేశారు.