MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా వంట గ్యాస్ కొరత లేదని తహసీల్దార్ రజనీకుమారి తెలిపారు. మండల కేంద్రంలోని హెచ్పీ గ్యాస్ గోదాంను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్ నిల్వలు, పలు రికార్డులను తనిఖీ చేశారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా గ్యాస్ సరఫరా చేయాలని నిర్వాహకులకు సూచించారు.