GDWL: కేటీదొడ్డి మండలం కొండాపూర్ నుంచి రాయచూరుకు అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. బొలెరో వాహనం (AP22TA0867)ను స్వాధీనం చేసుకొని, డ్రైవర్ కం ఓనర్ రవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పగడాల శ్రీనివాసులు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.