TG: HYD కొంపల్లిలోని “భారతీ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్” ప్రాజెక్టులో అక్రమాలు రుజువయ్యాయి. దానికి సంబంధించిన భారతి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై రెరా అథారిటీ కఠిన చర్యలు తీసుకుంది. 24 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి.. కొనుగోలుదారులకు ఇస్తామని చెప్పిన సంస్థ విఫలం కావడంతో.. బాధితులు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో కలిపి 60 రోజుల్లో ఇవ్వాలని ఆదేశించింది.