AP: అనేక సమస్యలు ఉన్నా రైతుల కోసం అనేక పనులు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ 20 నెలల్లో ఒక్కో అడుగు ముందుకేశామని.. సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ‘రైతులను పూర్తిగా ఆదుకుంటామని, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఆరోజు హామీ ఇచ్చాం. మీరు అండగా నిలిచారు. పంటలకు సమయానికి సాగునీరు ఇస్తున్నాం. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా జలాలతో కలిపాం’ అని వెల్లడించారు.