ASF: జైనూర్ లో ఈనెల 15న జరిగిన అర్జున్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో డబ్బుల వివాదంతోనే ఈ హత్య జరిగినట్లు CI రమేశ్ శనివారం తెలిపారు. నిందితులు ఆరుగురు కలిసి మృతుడిపై సిమెంట్ ఇటుకలు, కట్టెలతో దాడి చేశారని, ఒక నిందితుడు అమానవీయంగా పురుషాంగాన్ని కోసినట్లు విచారణలో తేలిందని వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామన్నారు