కడపలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో స్వయం సహాయక సంఘాల మహిళల చైతన్య సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి హాజరై మహిళలకు నిధుల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జెసీ, ఎస్పీ, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.