CSKపై సన్‌టీవీ నెట్వర్క్ మద్రాస్ హైకోర్టులో దావా వేసింది. తమ అనుమతి లేకుండా ‘జైలర్’, ‘కూలీ’ చిత్రాల మ్యూజిక్‌ను ధోనీ వంటి స్టార్ ఆటగాళ్ల ఎలివేషన్ వీడియోల కోసం వాడుతున్నారంటూ SUN TV పేర్కొంది. కాపీరైట్స్ తమ వద్ద ఉన్నందున ఇలా వాడటం చట్టవిరుద్ధమని తెలిపింది. దీనిపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతుంది. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.