మాజీ డీజీపీ హనుమంతు జగన్నాథ దొర మృతి పట్ల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుండి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో తన సొంత నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం జర్జంగి గ్రామవాసి అని ఎన్నో పదవులను చిత్తశుద్ధితో ఆయన నిర్వహించారని పేర్కొన్నారు.