KDP: నరసాపురం వైఎన్ కళాశాల సామాజిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంతర్వేది మైరెన్ సీఐ నరసింహా మూర్తి, ఎస్సై సోమశేఖర్ రెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తీర ప్రాంతాల్లో డ్రగ్స్ వాడకం, అక్రమ రవాణాపై ప్రభుత్వం, పోలీసు శాఖ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.