ATP: జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో ఆర్టీసీ బస్టాండ్లో డాగ్ స్క్వాడ్ ద్వారా త్రీ టౌన్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్స్ పసిగట్టడంలో శిక్షణ పొందిన ‘టైగర్’ జాగిలంతో అనుమానితుల బ్యాగులు, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి, అక్రమ మద్యం రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ పర్యవేక్షణలో ఈ సోదాలు జరిగాయి.