ప్రముఖ నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో ప్రభుదేవా కుమారుడు రిషిల్ రాఘవేంద్ర దేవా హీరోగా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శేఖర్ మాస్టర్ చెన్నై వెళ్లి ప్రభుదేవాకు కథ వినిపించారని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.