NLG: ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. శుక్రవారం చింతపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్వహించిన ‘దావత్-ఏ-ఇఫ్తార్’ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనారిటీల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.