ASR: పాడేరు ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 77 ఫిర్యాదులు అందాయి. డీఆర్వో అంబేద్కర్, ఎస్డీసీ నీలకంఠరావు వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.