నెల్లూరు నగరం 18వ డివిజన్ హరనాథపురం శ్రీకృష్ణ అవెన్యూ ప్రాంతంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని నాయకులు పేర్కొన్నారు.