SDPT: బెజ్జంకి మండలంలో ఈదురుగాలులు, వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలను తహసిల్దార్ శ్రీకాంత్ మంగళవారం సందర్శించారు. కల్లేపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో రేకులు ఎగిరిపోయిన ఇళ్లు, దెబ్బతిన్న పాఠశాల భవనాన్ని పరిశీలించి నష్టం వివరాలు సేకరించారు. నివేదికను పై అధికారులకు పంపించి బాధితులకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.