NGKL: తాడూరు తహశీల్దార్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యంపై క్రయవిక్రయదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లాట్ సమయానికి వచ్చినా సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని బాధితులు తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను డిమాండ్ చేశారు.