WGL: రేషన్ కార్డుదారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ బీమా’ పథకాన్ని అమలు చేయనుంది. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలోని 11 లక్షలకు పైగా కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా రక్షణ కల్పించనున్నారు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఇంటి యజమాని పేరుతో బీమా వర్తించనుండగా, రూ. 3,509 ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించనుంది.