కోనసీమ: రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో చేతి పైపులు నెలలుగా పనిచేయక ప్రజలు తీవ్ర త్రాగునీటి ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకుడు గండ్రోతు వీరగోవిందరావు ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్, రామాలయం, చిన్న చెరువు గట్టు ప్రాంతాల్లో పైపులు పనిచేయక మహిళలు దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుంటున్నారని తెలిపారు. పంచాయతీ అధికారులు మరమ్మతులు చేపట్టాలని కోరారు.