AP: సంపద సృష్టంచడంలో చంద్రబాబు ఫెయిలయ్యారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాల దృష్టి మరల్చడానికి గొడ్డలి పార్టీ అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం ముగిసిన అధ్యాయమని, ఐదేళ్ల తర్వాత చంద్రబాబు తన పనితీరుపై ఓటు అడగాలి.. కానీ, భయపెట్టి కాదన్నారు. ఇప్పటి నుంచే జగన్ను ఓడించాలని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.