కర్నూలు: ప్రముఖుల పై సోషల్ మీడియా వేదికల్లో అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు, వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించే పోస్టులు చేయడం చట్ట విరుద్ధమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.