VSP: ఏయూ విద్యార్థులు ఇకపై తమ పరీక్ష ఫలితాలను వాట్సాప్ ద్వారానే తెలుసుకునే సౌకర్యం అందుబాటులోకి తెచ్చినట్లు ఉపకులపతి రాజశేఖర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మనమిత్ర యాప్ ద్వారా ఈ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. ఏయూ సెనేట్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ సేవకు సంబంధించిన డెమోను చూపించారు.