ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సూపర్ హిట్ పొలిటికల్ క్రైమ్ ఫ్రాంచైజీ ‘సర్కార్ 4’ షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు. ముంబైలో జరిగిన రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనితో పాటు ‘సిండికేట్’ అనే మరో సినిమాపై కూడా పని చేస్తున్నట్లు చెప్పాడు. స్టీవెన్ స్పీల్బర్గ్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ దర్శకుడని వర్మ పేర్కొన్నాడు.