కోనసీమ: అంబాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య నిమిత్తం వచ్చే రోగుల పట్ల వైద్యులు, వైద్య సిబ్బంది మర్యాదపూర్వకమైన వైఖరితో మెలగాలని ఎంపీపీ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ దొమ్మేటి వెంకటేశ్వరరావు సూచించారు. ఆయన పీహెచ్సీ వద్ద అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి ఆసుపత్రి అభివృద్ధి పనుల నిర్వహణ, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై కమిటీ సభ్యులతో చర్చించారు.