KDP: టిష్యూ కల్చర్ సాంకేతికత వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పైడిపాలెం గ్రామంలో టిష్యూ కల్చర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిష్యూ కల్చర్ సాంకేతికత ద్వారా రైతులకు నాణ్యమైన, తెగుళ్లు లేని మొక్కలను అందించడం సాధ్యమవుతుందని తెలిపారు.