నంద్యాల: ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గొల్ల రాజేష్ ఇవాళ వినూత్న సేవ ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలో కేవలం ఒక్క రూపాయికే అన్నం, పప్పు, కర్రీతో రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ఇప్పటికే పుల్కా, జొన్న రొట్టె, కలర్ రైస్ వంటి వంటకాలను తక్కువ ధరకు అందిస్తూ.. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు తక్కువ ఖర్చుతో భోజనం అందించాలని చేపట్టారు.