కోనసీమ: పి.గన్నవరం లో రూ.23 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఇవాళ ప్రారంభించారు. గ్రామాభివృద్ధి దిశగా మరో ముందడుగు పడిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రజల డబ్బును వృథా చేస్తూ అనేక అభివృద్ధి పనులను ప్రారంభించి మధ్యలోనే అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు.