MNCL: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. శుక్రవారం బెల్లంపల్లిలోని 30వ వార్డులో డ్రైనేజీ పారిశుద్ధ్య పనులను ఆయన ప్రారంభించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వీరితో పాటు ఛైర్ పర్సన్ స్వాతి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.