NTR: ముగ్గులు పోటీలో విజేతలు విజయవాడ రామకృష్ణ పురంలో క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో క్షత్రియ మహిళా సంఘం వారు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రధమ బహుమతి మహాలక్ష్మి, రెండవ బహుమతి అనూష, మూడవ బహుమతిగా దేవర ఉమామహేశ్వరి గెలుపొందారు. పోటీల్లో గెలుపొందిన వారిని నిర్వాహకులు అభినందించారు. ఏటా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.