KNR: శంకరపట్నం మండలం వంకాయగూడెంలో వాటర్ ప్లాంట్ చెడిపోవడంతో గ్రామస్థులు, త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. 2023లోనిర్మించిన ఈ ప్లాంట్, మోటారు ఇటీవల కాలిపోవడంతో నిరుపయోగంగా మారింది. దీంతో త్రాగునీటికి వేరే గ్రామం వెళ్లి తెచ్చుకుంటున్నని తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. ఈ ఇబ్బందులను తొలగించాలని గ్రామ ప్రజలు నూతన పాలకవర్గాన్ని కోరారు.