AP: అమరావతిపై అసంబద్ధ ప్రకటనతో జగన్ నవ్వులపాలవుతున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాజ్యాంగంలో క్యాపిటల్ పదం లేదనడం జగన్ అవగాహనరాహిత్యానికి నిదర్శనమని తెలిపారు. రాజధానిపై వేర్వేరు మాటలు చెప్పడం జగన్ గందరగోళాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పారు. ప్రపంచంలో అనేక రాజధానులు నదీతీరాల పక్కనే ఉన్నాయన్నారు. అమరావతి అభివృద్ధి చెందకూడదనే జగన్ ఉద్దేశమని మండిపడ్డారు.