టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ స్కోరు 200 పరుగులు దాటింది. 41 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అతడికి తోడుగా బ్రేస్వెల్ క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్, ప్రసిద్ధ్ తలో వికెట్ తీసుకోగా, హర్షిత్ రాణా రెండు వికెట్లు పడగొట్టాడు.