KMR: పిట్లం మండలం బొల్లక్పల్లి వాసి సాయిలుగల్లంతైన విషయం విదితమే. రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు శనివారం రోజంతా నదిలో గాలించినా ఫలితం లేకపోయింది. ఆదివారం రెండో రోజు కూడా విపత్తు నిర్వహణ బృందం సభ్యులు నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు నది ఒడ్డున కన్నీరుమున్నీరుగా వేచి చూస్తున్నారు.