NLR: కందుకూరు నియోజకవర్గంలో ఈనెల 12న MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటిస్తారని ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయం తెలిపింది. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఉలవపాడు మండలంలోని మన్నేటికోట, మధ్యాహ్నం 12 గంటలకు లింగసముద్రం మండలంలోని అంగిరేకులపాడు, 12:45 గంటలకు మేదరమెట్ల పాలెం పంచాయితీలోని జంగాలపల్లిలో పర్యటిస్తారు. ఆయన వెంట ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు పాల్గొంటారని తెలిపారు.