RR: ఎల్బీనగర్ పరిసర ప్రాంతంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సరూర్‌నగర్ ఎక్సైజ్ అధికారులు ఆదివారం రాత్రి చేసిన దాడుల్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న MD ఇర్ఫాన్‌ను అరెస్ట్ చేశారు. అతని నుంచి 3.730 కిలోల గంజాయి, ఒక వాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మీర్పేట్లో 500 గ్రాములు, కర్మన్ ఘాట్‌లో 1.200 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేశారు.