TPT: టీటీడీ జేఈవో (విద్య, వైద్య) డా. ఎ. శరత్ శనివారం అశ్విని ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో భక్తులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది విధులు, పరిశుభ్రత, వైద్య సదుపాయాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి అధికారులకు సూచించారు.