ADB: బజార్హత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో ఏప్రిల్ 6న సీఎం వారి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. సభను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.