RR: చేవెళ్ల మండలం దేవరంపల్లిలో దారుణం జరిగింది. భూతగాదాల నేపథ్యంలో రాఘవేందర్ రెడ్డి అనే వ్యక్తి తన కన్నతల్లి సుమతమ్మ(66)ను గొంతు నులిమి హత్య చేశాడు. 2025, డిసెంబర్ 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్క రూప తన తల్లి పేరుతో ఉన్న భూమిని పట్టా చేయించుకోవడం, దానికి తల్లి మద్దతు తెలపడంతో రాఘవేందర్ రెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టాడు.