‘మన శంకరవరప్రసాద్ గారు’ హిట్ టాక్‌తో సంక్రాంతి రేసులో తనకు తిరుగులేదని అనిల్ రావిపూడి మరోసారి నిరూపించుకున్నాడు. గతంలో ‘F2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలతో పండగ హిట్లు కొట్టిన అనిల్.. ఇప్పుడు మెగాస్టార్‌తో మరో విజయం అందుకున్నాడు. క్లీన్ ఫ్యామిలీ కామెడీతో వరుస విజయాలు అందుకుంటున్న అనిల్.. ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’గా మారాడు.