VSP: అత్యవసర వైద్య సేవలు మెరుగుపరచేందుకు కేజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం పూర్తికావస్తోంది. ఆయూష్మాన్ భారత్ కింద కేంద్రం రూ.23.75 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.7.12 కోట్లు పరికరాల కొనుగోలుకు కేటాయించారు. ఏప్రిల్ రెండో వారం నాటికి బ్లాక్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.