AP: జనసేన నేత సామినేని ఉదయభాను కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో విభేదాలు ఉన్న మాట వాస్తవమని అన్నారు. జనసేన కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్య వస్తే స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు స్పందించడం లేదన్నారు. టీడీపీ నేతలు సహకరించకపోయినా వారితో విభేదించొద్దని జనసేన కార్యకర్తలకు సూచించారు. సమస్యలు ఉంటే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని.. జనసేన నేతలకు పార్టీ అండగా ఉంటుందని ఉదయభాను వెల్లడించారు.