PPM: మార్ట్ (Manyam Agri Rural Transformation) ప్రాజెక్టు జిల్లా ప్రగతికి సరికొత్త బాట వేయనుందని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి ఆకాంక్షించారు. దీనికి సంబంధించి ప్రతి శాఖాధికారి చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలతో వ్యవసాయ అనుబంధ రంగాల రైతులు, మహిళ ఆదాయం రెట్టింపు కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఛాంబర్లో మార్ట్ ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు.