ASF: దహెగాం మండలానికి చెందిన శ్యాంరావు SI విక్రమ్ కుమార్ పై SPకి ఫిర్యాదు చేశారు. తన భార్యపై అదే గ్రామానికి చెందిన రమేష్ దాడికి పాల్పడ్డాడని, ఈ విషయమై ఈనెల 2న ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీస్ స్టేషన్లో SI ముందే మళ్ళీ రమేష్ దాడి చేశారన్నారు. SI దాడిని అడ్డుకోకుండా తనను కొట్టడంతో పాటు దుర్భాషలాడినట్లు పేర్కొన్నాడు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.