AP: అంగన్వాడీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 62 ఏళ్లు దాటిన వారికి గ్రాట్యుటీ ఇస్తామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. ఇప్పటికే ఉద్యోగుల జీతాలను 3సార్లు పెంచామని తెలిపారు. అంగన్వాడీల 9 డిమాండ్లను నెరవేర్చామని.. మిగిలిన ఒక్కటీ నెరవేర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని 55,700 అంగన్వాడీ కేంద్రాల్లో 23,400ను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.