ELR: ఉపాధి పనుల్లో సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అంశాలపై ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మణికుమారి బుధవారం తెలిపారు. 2024-2025 వరకు మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన వివిధ రకాల ఉపాధి పనులను సామాజిక తనిఖీ బృందం పరిశీలించిందన్నారు. ఆయా పనుల్లో తనిఖీ బృందం గుర్తించిన పలు అంశాలపై రేపు ఉదయం 10 గంటలకు ప్రజా వేదిక నిర్వహిస్తామన్నారు.