ATP: ఆర్డీటీ సంస్థ పరిరక్షణ కోసం మాజీ ఎంపీ తలారి రంగయ్య తలపెట్టిన లక్ష పోస్టుకార్డుల ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కంబదూరు వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీన కుందుర్పిలోని ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆలయం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.