AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ నేత కత్తిపోట్లకు గురయ్యారు. శివరామిరెడ్డిని దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శివరామిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్రషర్ ఫ్యాక్టరీ విషయంలో అఖిలప్రియ దంపతులు.. భూమా జగత్ బెదిరించారని గతంలో బాధితుడు కేసు పెట్టినట్లు తెలుస్తోంది.