MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న వ్యాపారులు, ప్రజలు పన్నులు కట్టి గ్రామ అభివృద్ధికి బాటలు వెయ్యాలని పంచాయతీ ఈవో రాహుల్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో 100% పన్నులు వసూలు చేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు, వ్యాపారులు చెల్లించే వివిధ పన్నులను గ్రామ అభివృద్ధికి వినియోగిస్తామని తెలిపారు.